![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -57 లో..... కన్నాకి ఆకలిగా ఉందంటే మహా తనని రెస్టారెంట్ కి తీసుకొని వెళ్తుంది. మహా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందోనని చక్రి టెన్షన్ పడుతాడు. మహాకి ఫోన్ చేస్తాడు వస్తున్నామని మహా చెప్పగానే చక్రి కూల్ అవుతాడు. ఆ తర్వాత మహా కన్నా ఇంటికి వస్తారు. మహా ఏడుస్తుంటే అసలు ఏమైందని మాధవ అడుగుతాడు. నన్ను రప్పించింది శాశ్వతంగా అక్కడే ఉంచుకోవడానికి.. మళ్ళీ వాడితో పెళ్లి చెయ్యడానికి.. నన్ను మోసం చేశారని మహా ఏడుస్తుంది.
నా సర్టిఫికెట్స్ అన్ని కాల్చేసారు.. ఒక్కొక్కరికి వార్నింగ్ ఇచ్చాను.. నేను మంచి స్థాయిలో ఉంటానని ఛాలెంజ్ చేసానని మహా చెప్పగానే మంచి పని చేసావని కేశవ అంటాడు. ఆ తర్వాత మహా డల్ గా ఉంటే తన దగ్గరికి గాయత్రి వచ్చి మాట్లాడుతుంది. ఇంతకి నువ్వు వాడిని ఎలా ప్రేమించావని గాయత్రి అడుగుతుంది. ఆహా నా గురించి ఏం చెప్తుందో విందామని చక్రి అనుకుంటాడు కానీ మహా ఏం చెప్పదు. ఎప్పుడు ఈ డ్రెస్ లోనే ఉంటున్నావ్.. ఇంకా ఏం తెచ్చుకోలేదా అని అడుగుతుంది. లేదని మహా చెప్తుంది. మీ ఆయన ఉన్నాడు కదా వెళ్లి తెచ్చుకోమని గాయత్రి అంటుంది. అయిన ఇప్పుడు మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా వెళదాంలే అని గాయత్రి అంటుంది. మరుసటి రోజు ఉదయం మాధవ తప్ప ఎవరు నిద్రలేవరు. దాంతో ప్లేట్ తో సౌండ్ చేస్తూ అందరిని మహా నిద్ర లేపి పనులు చెప్తుంది.
ఆ తర్వాత ముగ్గు వేస్తుంది. ముగ్గుపై నారాయణ సిగరెట్ పడేస్తాడు. సిగరెట్ ని పక్కకి నెడుతుంటే ముగ్గు చెదిరిపోతుంది. ఎక్కడ మహా తిడుతుందోనని నారాయణ ముగ్గు వేస్తాడు. అందరు వచ్చి నవ్వుతారు. నారాయణ లారీ బొమ్మ గీస్తాడు. అది చూసి మహా బాగా నవ్వుకుంటుంది. ఆ తర్వాత అందరికి ఈ రోజు నేను టీ పెడతానని మహా అంటుంది. ఎలా పెడుతుందో ఏమో నేను తాగనని కేశవ అంటాడు కానీ మహా కోప్పడగానే అందరు టీ తాగుతారు. బాగుందని అంటారు.ఆ తర్వాత చక్రి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి నా భార్యకి జాబ్ కావాలని అడుగుతాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ లేవని అతను చెప్పగానే ప్లీజ్ తన తృప్తి కోసం ఫేక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రెండు క్వశ్చన్స్ అడుగు జాబ్ ఇవ్వకపోయినా పర్వాలేదని చక్రి అనగానే అతను సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |